Asia Cup 2022: మహిళల ఆసియా కప్‌లో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖరారు అయింది. శుక్రవారం పాకిస్తాన్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న భారత్, శనివారం ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ ను 59 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐదు మ్యాచ్ లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.
కొంతకాలంగా ఫామ్ లేమీతో సతమతమవుతున్న యువ ఓపెనర్ షేఫాలీ వర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 159 పరుగులు చేసింది. షేఫాలీ, స్మృతి మందాన తొలి వికెట్ కు 96 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఇద్దరు బౌండరీల వేటలో పోటీపడ్డారు. స్వల్ప వ్యవధిలో వీళ్ళిద్దరూ అవుట్ అయిన సూపర్ ఫామ్ లో ఉన్న జమీమా దీప్తితో కలిసి జట్టు స్కోరును 160 కి చేరువచేసింది. దీంతో విజయం సాధించారు.