నారా లోకేష్ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

-

ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితం ఆధారంగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. వైఎస్ మరణం నుంచి మొదలై జగన్ పార్టీ పెట్టడం, సీఎం కావడం వంటి ఘటనలను ఇందులో చూపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్రలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టీడీపీ నేత లోకేశ్ కి డైరెక్టర్ ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ‘మీడియా మిత్రులెవరికీ థాంక్స్ చెప్పను. కానీ నా ప్రియ మిత్రుడు లోకేశ్కు చెబుతాను. ఇవాళ మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి ఆయనే కారణం. డిసెంబర్లో సినిమా రిలీజై ఉంటే ప్రజలు మర్చిపోయేవారు. తెలివైన లోకేశ్ వ్యూహం పన్ని ఎన్నికల ముందు విడుదలయ్యేలా చేశారు’ అని చెప్పారు.

‘వ్యూహం’ సినిమా ఈ నెల 23న.. రెండో పార్ట్ ‘శపథం’ మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news