కొండా దంపతులపై రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా !

టాలీవుడ్ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. ఇక ఈ మధ్యలో కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఆర్జివి. ఇక బయోపిక్ లకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పటికే చాలా యధార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని బయోపిక్ లు తీసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరో రాజకీయ నాయకుడి బయోపిక్ తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. వరంగల్ లో ఇవాళ రామ్ గోపాల్ వర్మ పర్యటించారు. వివాదాలకు కేరాఫ్ అడ్రాస్‌ అయిన అర్జీవి వరంగల్ పర్యటన వెనుక కొండ మురళీ బయో పిక్ కారణమా అనే చర్చ జరుగుతోంది. కొండా దంపతులు చదివిన ఎల్బీ కాలేజి కి వెళ్లడంతో.. త్వరలోనే ఈ దంపతుల పైన సినిమా వస్తుందా అనే చర్చ వరంగల్ లో జరుగుతుంది. అయితే దీని పై.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.