ఢిల్లీ లీక్కర్ స్కాంలో ట్వి్స్ట్‌.. అప్రూవర్‌గా మారిన రామచంద్రపిళ్లై

-

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తు సంస్థ ఆయన ఆస్తులను ఇటీవల అటాచ్ చేసింది. పిళ్లై గతంలోను అప్రూవర్‌గా మారి, ఆ తర్వాత మాటమార్చారు. ఈడీ తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని కోర్టుకు వెళ్లారు. ఆ వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది.

అప్రూవర్స్‌గా మారిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్ళైతోపాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. కాగా అప్రూవర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. దీంతో మార్చి 7న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version