బీజేపీ అధ్యక్షుడు సోమూవీరాజు మీద మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఓవి రమణ ఫైర్ అయ్యారు. ఈరోజు తిరుపతిలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన ఆయన బీజేపీ అధ్యక్షుడు ఆలయ పరిరక్షణ పేరుతో చేసే కార్యక్రమంలో ఫోటో షూట్ తప్ప ఇంకేమీ లేదని అన్నారు. డిక్లరేషన్ విషయంలో అన్ని పార్టీలు మాట్లాడే భాష, చెప్పే విధానం బాగా లేదని ఆయన అన్నారు. నిమిషానికి వందలాది మంది వెళ్లే పరిస్థితిలో మతం అడగటం తిరుమలలో సాధ్యం కాదని ఆయన అన్నారు. అన్యమతస్థులు కూడా తిరుమలకు రావచ్చని డిక్లరేషన్ తప్పనిసరి కాదని రమణ పేర్కొన్నారు.
ముస్లింలు సమర్పించిన నగలు ఇప్పటికీ శ్రీ వారి ఆలయంలో పూజల్లో వాడుతున్నారని ఆయన అన్నారు. ముస్లింలు కాశీ కి వెళ్తున్నారన్న ఆయన వీర్రాజు వేంకటేశ్వర స్వామి కొడాలి నానికి బావమరిది అవుతారా అని మాట్లాడం తగదని అన్నారు. ఇలా మాట్లాడే వీర్రాజు అసలు హిందువేనా అని ఆయన ప్రశ్నించారు. హిందు మతంపై అక్కర ఉంటే శ్రీనివాస మంగపురం ఆలయాన్ని పురావస్తు శాఖ నుంచి టీటీడీకి ఇప్పించండని ఆయన అన్నారు. వేంకటేశ్వర స్వామితో రాజకీయ లబ్దికి యత్నిస్తే నాశనం అయిపోతారన్న ఆయన అయోధ్యలో మొదటి ఆహ్వానం యోగి ఆదిత్య ముస్లింకు ఇస్తారు, కానీ తిరుమలను మాత్రం ముస్లింలకు దూరం చేస్తారా? అని ప్రశ్నించారు.