రంజాన్.. ఈ పేరు వినిగానే అందరికి నోరూరి పోతుంది.. అదేనండి హలీం.. రకరకాల పాయసాలు కళ్ళముందు కనిపిస్తాయి.ఆ హలీం కు గొప్ప చరిత్ర ఉందని నిపుణులు అంటున్నారు..ముస్లిం వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమయంలో ఎక్కడ చూసినా హలీమ్ సెంటర్స్ కనిపించేస్తాయి. నోరూరించే హలీమ్ తినేందుకు చిన్న పెద్ద ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీమ్ తింటే తిరిగి పొందవచ్చునని చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు హలీం గురించి పూర్తి సమాచారన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
*. ఎంతో మంది ఇష్టంగా తినే ఈ హలీమ్ ని ఆరేబియన్స్ తీసుకొచ్చారు. హరీస్ అని పిలుస్తారు. 10వ శతాబ్దంలో కితాబ్ అల్ తబిక్(వంటల పుస్తకం)లో హలీమ్ రెసిపి గురించి తొలిసారిగా రాశారు. హైదరాబాద్ నిజాం ఆర్మీ దగ్గర ఉండే అరేబియన్ సైన్యం దీన్ని భారత్ లోకి తీసుకొచ్చింది.
*. హలీమ్ ని ఒక్కపక్కరూ ఒక్కో పేరుతో పిలుస్తారు. అరేబియన్లు, ఆర్మేనియా వాళ్ళు ‘హరీస్’ అంటారు. టర్కీ, ఇరాన్, అజర్ బైజాన్, ఇరాక్ లో హలీమ్ ని ‘దాలీమ్’ అని అంటారు. పాకిస్థాన్ లో ‘కిచర’ అని పిలుస్తారు.
*. ఈ హలీం ను మాంసం తో తయారు చేస్తారు.. మటన్, బీఫ్, చికెన్ తో హలీమ్ తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, మినపప్పు, వేస్తారు. ఇవే కాదు మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వామ్ము, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు, బెల్లంతో పాటు డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు. గ్రేవీగా ఉండే వేడి వేడి హలీమ్ చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. దాని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి గార్నిష్ చేసి ఇస్తారు.. ముఖ్యంగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవల్..
*. కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మటన్, డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం.గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి మంచి ఫుడ్ అనే చెప్పాలి…
*. హలీం తయారు చెయ్యడానికి దాదాపు 6,7 గంటలు పడుతుందని తెలుసు.. ఇదండి ఇవాళ్టికి హలీం గురించి తెలుసుకున్నాం.. రేపు రంజాన్ కు సంబంధించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..