తండ్రి కాబోతున్న రానా దంపతులు.. స్పందించిన టాలీవుడ్‌ హల్క్‌

-

తన భార్య మిహీక గర్భందాల్చినట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై హీరో దగ్గుబాటి రానా స్పందించారు. తన భార్య గర్భవతి కాదని చెప్పారు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలుకనున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. టాలీవుడ్ అగ్రనటుడు రానా దగ్గుబాటి భార్య మిహీక బజాజ్ గర్భవతి అని, రానా తండ్రి కాబోతున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ నిరాధారమైన వార్తలని మిహీక బజాజ్ ఇప్పటికే ఖండించారు. అయితే, రానా తండ్రి కాబోతున్నాడంటూ గాయని కనికా కపూర్ ఓ ట్వీట్ చేయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ఈసారి రానా స్పందించారు. తన భార్య మిహీక గర్భవతి కాదని కనికా కపూర్ కు స్పష్టం చేశారు. మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని వివరించారు. అంతేకాదు, నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను… అలాగే నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి అంటూ కనికా కపూర్ ను ఉద్దేశించి రానా చమత్కరించారు. రానా, మిహీక జోడీ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ప్రవేశించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version