బాహుబలి ఛాలెంజ్ స్వీక‌రించిన భళ్లాలదేవ..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా.. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్ర‌భాస్ త‌న ఇంట్లో మొక్క‌లు నాటి రామ్‌చరణ్‌, దగ్గుబాటి రానా, శ్రద్ధాకపూర్‌లను నామినేట్‌ చేశారు.

కాగా, ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన రానా మొక్క‌లు నాటిన ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసారు. ఆదిపురుష్ ప్ర‌భాస్, రాక్‌స్టార్ శృతి హాస‌న్ ల ఛాలెంజ్ స్వీక‌రించాను. ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తి ఒక్క‌రు చేపట్టాల‌ని కోరుతున్నా అని తెలిపారు. ఈ సందర్భంగా తనను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని రానా కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version