రానా ఆరోగ్యం పై ట్వీట్‌

-

రానా దగ్గుబాటి ఆరోగ్యం పై కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న సురేష్ బాబు మాత్రం తన కొడుకుకి ఏం కాలేదని.. కేవలం కంటి సమస్య మాత్రమే ఉందని కన్ఫర్మ్ చేసాడు. దానికి తోడు కొన్ని రోజులుగా రానా ఇండియాలో లేకపోవడం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది.

ఈ మధ్యే మళ్లీ ఇండియాకు వచ్చాడు రానా దగ్గుబాటి. వచ్చిన వెంటనే ముంబైలోనే కొన్ని రోజులు ఉన్నాడు. ఈ మధ్యే రాజమౌళి అండ్ టీంతో కలిసి బాహుబలి ప్రివ్యూ షో కోసం జపాన్, లండన్ వెళ్లాడు. ఇవన్నీ ఒకెత్తయితే కొంతకాలంగా రానా అనారోగ్యంతో ఉన్నాడని వార్తలొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటిపై రానా క్లారిటీ ఇచ్చాడు. నాకు సంబంధించిన విష‌యం ఏదైనా స‌రే నేను చెప్పేదే క‌రెక్ట్ వేరే వాటిని న‌మ్మ‌కండి అని ట్విట్ట‌ర్‌లో స్పందించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version