మస్తాన్ సాయి, లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మస్తాన్ సాయి, లావణ్య కేసులో పోలీస్ అధికారి ఇరుక్కున్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన లావణ్యతో పరిచయం పెంచుకున్నాడు డీఐ శ్రీనివాస్. లావణ్యతో తరచూ వాట్సప్ లో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
సోషల్ మీడియాలో లావణ్య, శ్రీనివాస్ కాల్స్ వైరల్ అవుతున్నాయి. డీఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమేనని తేలడంతో.. ఐజీ ఆఫీసుకు అటాచ్ చేసింది సైబరాబాద్ సీపీ. కాగా… మస్తాన్ సాయి పై ఇప్పటికే లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో… మరోసారి లావణ్య పాపులర్ అయ్యారు. అప్పట్లో.. రాజ్‌తరుణ్ ను గెలికింది. ఇప్పుడు మస్తాన్ సాయి, లావణ్య కేసులో పోలీస్ అధికారి ఇరుక్కున్నాడు.