తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగాల దందా కొనసాగుతోంది. కొందరు కేటుగాళ్లు ఏకంగా చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి పేరును వాడుకుని ఉద్యోగాల ఆర్డర్ కాపీలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియక కొందరు అమాయకులు ఆ ఆర్డర్ కాపీలను తీసుకుని ఏకంగా సచివాలయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ అక్రమ దందాలో సెక్రెటేరియట్ ఉద్యోగుల ప్రమేయం ఉందని పోలీసులు విచారణ మొదలెట్టారు. కాగా, గత రెండు వారాలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న నకిలీ ఐఏఎస్ బాలకృష్ణ సచివాలయంలో హల్‌చల్ చేయగా.. సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నకిలీ రెవెన్యూ ఉద్యోగి, నకిలీ ఎమ్మార్వో, తాజాగా నకిలీ ఐఏఎస్ మరో ఇద్దరు ఫేక్ అటెండర్లను కూడా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగాల దందా
చీఫ్ సెక్రటరీ పేరుతో ఉద్యోగాల ఆర్డర్ కాపీలు తయారు చేసిన కేటుగాళ్లు
అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ తీస్కుని సెక్రటేరియట్ వచ్చిన బాధితులు
ఇందులో సెక్రటేరియట్ ఉద్యోగుల ప్రమేయం పై ఆరా తీస్తున్న పోలీసులు https://t.co/uxawadjPT2 pic.twitter.com/ZD8h2khXcm
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2025