మంచివాడేగాని.. చెడ్డ‌వాడ‌ట‌.. ఇదేం ట్విట్ రానా..?

-

దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. నీది నాదీ ఒకే కథ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్నారు. . లీడర్ సినిమాతో నటుడుగా మంచి పేరు తెచ్చుకొని ఆ తరవాత విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించాడు రానా . రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో భల్లలదేవ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు రానా. అయితే ఇప్పుడు విరాటపర్వం చిత్రంలో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావలసింది. ఆ మధ్య రానా అనారోగ్యానికి గురికావడంతో ఆలస్యమైంది. మరో నెల రోజుల పాటు చిత్రీకరణ జరిగితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. పదిమందికి మంచి జరగాలనే ఉద్దేశంతో పోరాడే చెడ్డ వ్యక్తిగా రానా కనిపించనున్నాడని చెబుతున్నారు. అంతే మంచివాడేగాని.. చెడ్డ‌వాడిగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ పాత్ర రానా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కూడా కొత్తగా ఉంటుందనీ, ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version