ర‌ణ‌రంగంకు ఎవ‌రు షాక్ త‌గిలిందిగా…!

-

టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా ప్ర‌తి శుక్ర‌వారం రెండు, మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల్లో ఇద్ద‌రు యంగ్ హీరోలు న‌టించ‌డంతో మంచి అంచ‌నాలే ఉన్నాయి. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ఎవరుతో పాటు శర్వానంద్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Ranarangam To Evaru Movie Shock

గ‌త వారం నాలుగు సినిమాలు రిలీజ్ అయినా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాట‌లేక‌పోయాయి. దీంతో ఆగ‌స్టు 15 సెల‌వు కావ‌డంతో ఈ అడ్వాంటేజ్‌ను ఎవ‌రు, ర‌ణ‌రంగం బాగా క్యాష్ చేసుకుంటాయ‌ని…. రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. అయితే ఈ అవ‌కాశాన్ని అడ‌వి శేష్ క్యాష్ చేసుకుంటే… శ‌ర్వానంద్ మిస్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక అడ‌వి శేష్ ఎవ‌రు సినిమాకు ఒక రోజు ముందుగానే ప్రీమియ‌ర్లు వేశారు. సినిమాకు సూప‌ర్ టాక్ వ‌చ్చింది. దీంతో ప్రీమియ‌ర్ల‌తో పాటు ఫ‌స్ట్ డే వ‌సూళ్లు కూడా బాగానే ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో కూడా ర‌ణ‌రంగం కంటే ఎవ‌రుకే ఎక్కువుగా రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక గురువారం ఉద‌యానికి ఎవ‌రుకు బాగా టాక్ రావ‌డంతో ఎవ‌రు థియేట‌ర్ల వ‌ద్దే ఎక్కువుగా సంద‌డి క‌నిపిస్తోంది.

రణరంగం విషయంలో అలాంటి సందడి కనిపించటం లేదు. సోషల్ మీడియాలోనూ రణరంగంకు సంబంధించి హడావిడి లేదు. ఈ ఎఫెక్ట్‌తోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా పెద్ద‌గా లేవ‌నే ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా త‌న సినిమాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డే శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం ప్ర‌మోష‌న్ విష‌యంలో పెద్ద‌గా దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో ఎవ‌రు సినిమాతో పోలిస్తే కాస్త వెన‌క‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి రేపు క‌లెక్ష‌న్ల విష‌యంలో ఏం చేస్తాడో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version