బయో సెక్యూర్ పద్ధతిలో రానా పెళ్లి..?

-

టాలీవుడ్లో మొన్నటివరకు ఎవర్గ్రీన్ బ్యాచిలర్ గా ఉన్నా రానా ఇంకొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా తన ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని చెప్పి అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు మహిక బజాజ్ ను రానా ఆగస్టు ఎనిమిదవ తేదీన పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి, ఆకాశాన్ని అంటేలా వేదికలు… ఎంతోమంది అతిరథ మహారథుల మధ్య పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రానాకు అలాంటి అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి, రానా మహికల పెళ్లి ఫలక్నామా పాలస్ లో జరగనుందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి బయో సెక్యూర్ పద్ధతిలో జరగనుందట . రామానాయుడు స్టూడియోలో రెండు కుటుంబాలకు చెందిన 30 మంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్లికి జరగనుందని సమాచారం ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version