సినిమా పెద్దదైనా.. చిన్నదైనా.. కంటెంట్ ఉంటే సూపర్ హిట్టే అని ఇప్పటికే తెలుగులో వచ్చిన సినిమాలు ఫ్రూవ్ చేశాయి. అందులో భాగంగానే ఈరోజు రణస్థలి అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు లీడ్ రోల్స్‌లో పరశురాం శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఓసారి చూద్దాం.
రణస్థలం కథ ఏమిటంటే? తల్లి లేని బసవ(నీల మాధవ ధర్మ)ని అతని తండ్రి(సమ్మెట గాంధీ) అల్లారుముద్దుగా పెంచుతూ చదివిస్తాడు. తనకు మరదలు వరుసయ్యే అమ్ములు(చాందిని)తో వివాహం కూడా జరిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు చనిపోతుంది. దీంతో అమ్ములు మరణానికి కారణమైన వారందరినీ మట్టుపెట్టాలని బసవ నిర్ణయించుకుంటాడు. అందుకు ఇంటికి కూడా రాకుండా అడవిలోనే కాపు కాస్తూ తన భార్యను చంపిన వారిని ఎలా మట్టుపెట్టాడన్నది సినిమా కథ. బసవ భార్య అసలు ఎలా మరణించింది? ఆమె మరణానికి కారణం ఎవరు? వారిని బసవ ఎలా చంపాడు? బసవకు అసలు ఈశ్వరి(అమ్ము అభిరామి) ఏమవుతుంది? అనే విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ… తెలుగులో ఎన్నో రివెంజ్ డ్రామా సినిమాలో వచ్చాయి… ఈ సినిమా కూడా అదే కోవాలోకి వస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా చంపిన ముఠాని ఓ సామాన్యుడు ఎలా మట్టుబెట్టాడు అన్నదే రణస్థలి కథ. పాయింట్ పరంగా చెప్పుకుంటే ఇలా సింపుల్ గానే ఉన్నా కథ విషయంలో మాత్రం దర్శకుడు చాలా తెలివిగా ప్రేక్షకులందరికీ థియేటర్లో సీట్లకే అతుక్కునేలా చేయగలిగాడు. చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో దాదాపుగా సినిమా టీం సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. దానికి తోడు సినిమా ఆద్యంతం ఒక అడవి లాంటి లొకేషన్లో చేయడం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. విలేజ్ లైఫ్ విలేజ్, కల్చర్ ఎలా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేయడం అభినందనీయం. అయితే కొన్ని కొన్ని లోపాలు సంగతి పక్కన పెడితే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది.
నటీనటులు… ఈ సినిమాలో బసవ పాత్రలో నటించిన నీల మాధవ ధర్మ తన నటనతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు, ఈశ్వరి పాత్రలో నటించిన అమ్ము సహా ఇతర కీలక పాత్రలలో నటించిన అందరూ తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో నటించిన మిగతా నటీనటులు అందరూ కొత్తవారే అయినా అనుభవం ఉన్నవారిలా నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం… డైరెక్టర్ పరుశురాం మంచి కథను ప్రేక్షకుల ముందుకు పరిచయం చేశాడు. కేశవ కిరణ్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. మిగతా టెక్నికల్ విభాగాలు బాగానే పనిచేశాయి.
చివరగా… చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
Rating: 2.5/5