సంచలన నిర్ణయం తీసుకున్న రణబీర్ కపూర్.. షాక్ లో అభిమానులు..

-

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. పెళ్లయి ఒక పాప ఉన్నప్పటికీ ఆయన అంటే ఇప్పటికి పడి చచ్చిపోయే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా రన్బీర్ చేసే రొమాంటిక్ కామెడీ అంటే పడి చస్తారు.. అయితే ఇలాంటి హీరో తాజాగా ఓ సంచల నిర్ణయం తీసుకోవడమే కాకుండా దాన్ని అమలు చేసే ప్రయత్నంలో కూడా ఉండటం ఆయన అభిమానుల్ని ఒకింత నిరాశకు గురి చేసింది..

 

బాలీవుడ్ రొమాంటిక్ హీరో ప్లే బాయ్ హీరో రణ్బీర్ కపూర్.. ఇతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిది అంటే ఈయన పేరు వింటేనే అమ్మాయిలు పడి చచ్చిపోతారు
ఈయన సినిమాలు చూడటం కోసం పోటీ పడుతూ ఉంటారు స్టార్ హీరోయిన్ సైతం ఇతను వెంట పడుతుంటారు.. ముఖ్యంగా ఈయన చేసే రొమాంటిక్ సినిమాలుకు పిచ్చి క్రేజ్ ఉంటుంది.. బాలీవుడ్లో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఈయన తాజాగా ఆలియా భట్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే..

హీరో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు… సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రణ్‌బీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడుతూ.. తాను ఇక నుంచీ రొమాంటిక్‌ కామెడీ మూవీస్‌ చేయనని ప్రకటించారు. దాంతో ఆయన ఫ్యాన్స్.. షాక్ అయ్యారు. ముఖ్యంగా రణ్ బీర్ పై క్రష్ ఉన్న లేడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.. అయితే ఇది ఎలా ఉన్నావ్ ఆయన నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చాడు.. రొమాంటిక్ మూవీ చేసీ చేసీ తాను విసుగు చెందానని, అందుకే ఈ తరహా సినిమాలు చేయదల్చుకోవడం లేదు అని ప్రకటించారు యంగ్ హీరో. ఇప్పుడు మారిన ట్రెండ్‌కు, తనకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్‌ సెట్‌ కావని ఆయన అన్నారు. ఆయన ఈ రకంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం తాను లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో ఒక రొమాంటిక్‌ కామెడీ మూవీలో నటిస్తున్నానని. ఇక ఇదే నా చివరి రోమ్‌ కామ్‌ అని చెప్పారు రణ్ బీర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version