హైదరాబాద్ నగర శివారులోని పాతబస్తీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ఓ మహిళను దారుణంగా హత్య చేసారు. హత్య చేయబడ్డ మహిళ మొహం పై బండరాయితో బలంగా మోదీ హతమార్చారు గుర్తుతెలియని దుండగులు.
హత్యకు గురైన మహిళ దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానo వ్యక్తం చేస్తున్నారు. హత్య కాబడ్డ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు మహిళను నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అని భావిస్తున్నారు పోలీసులు. సంఘటన స్థలంలో మహిళకు సంబంధించిన దుస్తులు మరి ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.