ఎంతగానో మార్పు చెందుతున్న ఈ టెక్నాలజీ రంగంలో ప్రతి ఒక్క పనికి ఆన్లైన్ లో కాంటాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. అదే విధంగా మనము రవాణా కోసం సైతం ఓలా , ఉబర్ మరియు ర్యాపిడో సేవలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు ఈ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా ఒక యువతి బెంగుళూరు లో ఒక చోటు నుండి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో ను ఎంచుకుంది. కాగా ర్యాపిడో డ్రైవర్ ఆమెను ఎక్కించుకుని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ, మరో చేత్తో ఫ్యాట్ జిప్ ను తీసి అసభ్యంగా చేశాడట. ఊహించని ఈ పరిణామాలకు అవాక్కయిన ఆ అమ్మాయి తన ఇంటికి చేరుకోక ముందే బైక్ దిగి వెళ్లిపోయిందట. కాగా ఆమె ఇంటి చేరుకున్న తర్వాత కూడా ఆ డ్రైవర్ ఆమెను వదలకుండా ఫోన్ ద్వారా ఆమెకు “LOVE YOU” అంటూ మెసేజ్ చేశాడట.