రాజశేఖర్ ‘అల్లరి ప్రియుడు’ విజయోత్సవ వేడుకలో మూవీ యూనిట్‌కు అరుదైన గౌరవం..

-

యాంగ్రీ స్టార్ రాజశేఖర్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పవర్ ఫుల్ సినిమాలతో అలరిస్తు్న్న క్రమంలో ఆయన్ను లవర్ బాయ్ గా చూపించి వాహ్..వా… అనిపించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో రాజశేఖర్ చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. మ్యూజికల్ లవ్ స్టోరిగా వచ్చిన ఈ పిక్చర్ రిలీజ్ తర్వాత సెన్సేషన్ అయింది. ఇక ఈ సినిమా విజయోత్సవ వేడుకలో మూవీయూనిట్ కు అరుదైన గౌరవం దక్కింది.

రమ్య కృష్ణ, మధుబాల హీరోయిన్స్ గా ఈ పిక్చర్ లో నటించారు. రాజశేఖర్ ను అత్యద్భుతంగా లవర్ బాయ్ గా చూపించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఇక ఈ సినిమాలో కొరియోగ్రఫీపైన రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలో సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేశారు.

ఈ చిత్ర విజయోత్సవ వేడుక అనగా 200 రోజుల ఫంక్షన్ కు ఇండియన్ క్రికెట్ టీమ్  కపిల్ దేవ్ తదితరులు మొత్తం హాజరు కావడం విశేషం. ఇండియన్ క్రికెటర్స్ అందరూ వచ్చి మూవీ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. అలా ఈ చిత్ర యూనిట్ కు అరుదైన గౌరవం దక్కింది. రాజశేఖర్ ఈ సినిమా తర్వాత లవర్ బాయ్ అయిపోయారు.

రాజశేఖర్ ఇటీవల ‘శేఖర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫుల్ బిజీ అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తానని, అవసరమైతే విలన్ రోల్ కూడా ప్లే చేస్తానని చెప్పుకొచ్చారు రాజశేఖర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version