జిరాఫీ ని పొట్టనపెట్టుకున్న దుండగులు…అంతరించిపోయినట్లే

-

కెన్యా దేశంలో అరుదైన తెల్లటి జిరాఫీ లను కొందరు వేటగాళ్లు హతమార్చినట్లు తెలుస్తుంది. దీనితో ఆఖరి తెల్ల జిరాఫీ అంతరించి పోయింది. ఇటీవల కెన్యా దేశంలో తెల్లని ఓ అరుదైన ఆడ జిరాఫీ ఒక కూనకు జన్మనిచ్చింది. అయితే దానిని జాగ్రత్తగా కాపాడుకుంటుండగా డబ్బులకు ఆశపడ్డ కొందరు దుండగులు ఆ ఆఖరి తెల్ల జిరాఫీని, దాని 7 నెలల కూనను చంపి పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో కెన్యా ప్రజానీకం తీవ్ర విచారంలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ చక్కర్లు కొడుతుండడం తో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. జిరాఫీలు నివసించిన ఈశాన్య కెన్యాలోని ఇషాక్‌బిని హిరోలా కమ్యూనిటీ కన్జర్వెన్సీ మేనేజర్ మహ్మద్ అహ్మద్‌నూర్ ఒక ప్రకటనలో, రేంజర్లు వారి మరణాలను ధృవీకరించారని మరియు అస్థిపంజర అవశేషాల ఛాయాచిత్రాలు ఉన్నాయని తెలిపారు. అలానే ఈ ఘటన పై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ‘కెన్యా మొత్తానికి ఈ రోజు చాలా విచారకరమైంది.

ప్రపంచంలో కేవలం రెండే తెల్ల జిరాఫీలు మిగిలి ఉన్నాయి అనుకున్నాం. ఇప్పటివరకూ మేమే వాటిని సంరక్షిస్తూ వచ్చాము. అయితే ఈ రోజు వాటిని కూడా కోల్పోయాము’ అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్థము చేశారు. అయితే ఇది వేటగాళ్ల పనే అని వారు భావిస్తున్నారు. వేటగాళ్ల కారణంగా అత్యంత అరుదైన ఈ తెల్ల జిరాఫీ ల జాతి ఇక అంతరించిపోయినట్లే అని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news