తెలంగాణాలోని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఒక వ్యక్తిని అభంతరకర రీతిలో బూతులు తిడుతున్న ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అసభ్య పదజాలంతో ఒక యువకుడిని దూషించారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడిని బెదిరింపులకు గురి చేశారు ఎమ్మెల్యే రసమయి. ఇంకోసారి నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని ఆగ్రహంతో ఎమ్మెల్యే తిట్టడం సంచలనంగా మారింది. బెజ్జంకి మండలం బేగం పెట్ కి చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో తమ గ్రామం అభివృద్ధి చేయడం లేదంటూ పోస్ట్ చేశారు. అవి చూసిన ఎమ్మెల్యే ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు.