బీహార్ లో మూడవ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక ప్రచారం కూడా చేపట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బీహార్ మూడో దశ ఎన్నికలకు కొనసాగుతున్న సమయంలోనే కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది. భేని శెట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న నీరజ్ అనే వ్యక్తి ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చివరికి తుది శ్వాస విడిచాడు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చివరికి ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రాణాలు వదిలారు.