ఆ స్టార్ హీరో అంటే క్రష్ అంటున్న రష్మిక..

-

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ రష్మిక మందన. ఆమె అభినయంతో తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతోంది. అయితే… ఇటీవల విడుదలైన ‘పుష్ప’తో నేషనల్‌ క్రష్‌గా మారారు నటి రష్మిక. ఆ సినిమా సక్సెస్‌ తర్వాత ఆమె బాలీవుడ్‌, దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. దీంతో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరో సినిమాల్లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. కాగా, తాజాగా రష్మిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రాలపై ముచ్చటించారు.

గొప్ప నటులైన విజయ్‌, అమితాబ్‌ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం నాకు దేవుడి దయ వల్ల లభించింది. అందుకు నేనెంతో గర్వంగా ఫీలవుతున్నా అని వ్యాఖ్యానించారు. ఆయా హీరోలతో చేస్తోన్న కథలు కూడా అద్భుతంగా ఉన్నాయని, వాళ్ల నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటున్నట్లు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి సినిమాతో మరింత మెరుగైన నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందన్న రష్మిక.. ఇక దళపతి విజయ్‌ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ని ఒక హీరోగా ఎంతగానో ఇష్టపడుతున్నాను అంటూ తన క్రష్‌ను బయట పెట్టింది.

వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేనే హీరోయిన్‌ అని ఫిక్స్‌ అయ్యాక.. మొదటిసారి ఆయన్ని కలిసిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను అని ఆమె తెలిపారు. సినిమా పూజా కార్యక్రమం సమయంలో టెన్షన్‌తో ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయాను. అనంతరం ఆయనకి దిష్టి తీశాను. నేను అలా చేస్తుంటే ఆయన ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయారు. ఇక సెట్‌లో ఉన్న వాళ్లందరూ గట్టిగా నవ్వారు” అని ఆమె వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version