దర్శకులకు రష్మిక కండీషన్లు…?

-

ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి ఊపు మీద ఉన్న హీరోయిన్… రష్మిక మందన. ఈ ఏడాది రెండు సినిమాలు ఆమెకు హిట్స్ రావడం తో ఇక ఆమెతో సినిమా చేయడానికి గానూ దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి ఆమెకు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమాలో ఆమె ఫైనల్ అయినట్టు సమాచారం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె భారీగా పారితోషికం పెంచడమే కాకుండా దర్శకులకు కొన్ని కండీషన్ లు పెట్టినట్టు సమాచారం. అవి ఏంటీ అంటే… తాను స్కిన్ షో చేసేది లేదని చెప్పినట్టు సమాచారం. అలాగే లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించే అవకాశం లేదని… సీన్ మరీ అభ్యంతరకరంగా ఉంటే తాను చేయలేను అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

పెద్ద హీరో సినిమా అయినా సరే తాను చేయలేను అని ఆమె చెప్పగా దర్శకులు కూడా ఆమెను అంతగా ఒత్తిడి చేయవద్దని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటికి భారీగానే డిమాండ్ చేసింది. దీనితో ఆమెను కొన్ని సీన్స్ చెయ్యాలని కూడా అడగగా ఆమె అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. ఈ ఏడాది మహేష్ బాబు తో… నితిన్ తో ఆమె హిట్స్ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news