ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఏదైనా ఈవెంట్ లకు లేదా ఫంక్షన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి ఖరీదైన దుస్తులను ధరించి మరింత ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది రకరకాల దుస్తులను ఖరీదైన వాటిని ధరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని మొన్నటికి మొన్న సుమారుగా 7 లక్షల రూపాయల విలువైన బ్లాక్ డ్రెస్ ను ధరించి కృతి సనన్ ముంబై అవార్డు ఫంక్షన్లో మెరువగా.. ఇక ఇటీవల రష్మిక కూడా ప్రత్యేకంగా ఒక ఈవెంట్ కోసం ఖరీదైన దుస్తులు ధరించి ఆకర్షణగా నిలవబోతోంది. ఇకపోతే మలయాళం లో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న సీతారామం సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
మలయాళం లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాకి సంబంధించి ఈరోజు హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్న నేపథ్యంలో రష్మిక ఈ డ్రెస్ ను ధరించబోతోంది. ఇక రష్మిక వేసుకున్న ధర ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక రష్మిక ధరించిన బ్లాక్ సిల్క్ షర్ట్ ధర రూ.12800 కాగా .. బ్రోకేడ్ ట్రౌసర్ ధర రూ.36,500.. ఇక మొత్తం ఈ డ్రెస్ ధర రూ.49,300.. ఇక ఈ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్..పాయాల్ కంద్వాల అనే వ్యక్తి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం.
ఇకపోతే రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప పార్ట్ టు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని చిత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఛలో చిత్రంతో అడుగు పెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే ఇలా అద్భుతమైన ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.