ఆరేళ్ల పాటు స్పేస్ లో ఉన్న ఎలుక స్పెర్మ్..!

-

ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరు ఆశ్చర పోతున్నారు. చూశారంటే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక అసలు ఏం జరిగింది అనేది చూస్తే.. భూమి నుండి 2013 లో ఎలుక స్పెర్మ్ ని తీసుకుని వెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి 2013లో స్పెర్మ్ ని తీసుకు వెళ్లగా ఆరేళ్ల తర్వాత తిరిగి భూమి మీదకు తీసుకు వస్తే అద్భుతమైన ఫలితాలు కనపడ్డాయి.

నిజంగా దీనిని విన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. జాపనీస్ రీసెర్చర్లు ఈ స్టడీ చేశారు. ఈ ఫలితాలు చూసి ఆశ్చర్య పోయారు. 2013లో భూమి నుండి ఎలుక స్పెర్మ్స్ ని తీసుకు వెళ్లడం తిరిగి ఆరేళ్ల తర్వాత భూమికి తీసుకు వచ్చి పరిశోధన చేయడం జరిగింది.

అలా తీసుకు వచ్చిన ఎలుక స్పెర్మ్ ని రీప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉపయోగిస్తే 168 ఆరోగ్యకరమైన పిల్లలకి జన్మనిచ్చింది ఆ స్పెర్మ్. పైగా ఎటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా లేవు. జన్మించిన ప్రతి ఎలక పిల్లకి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా నార్మల్ గా వున్నాయి.

ఆరేళ్ల తర్వాత తిరిగి రేప్రొడెక్షన్ ప్రాసెస్ ని దీని మీద ప్రయోగిస్తే ఈ ఫలితాలు రావడం నిజంగా షాకింగ్ గా ఉంది అని నిపుణులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ యమనిషి జపాన్ 3 బాక్సులతో ఎలుక స్పెర్మ్స్ ని పంపించింది. ప్రతి ఒక బాక్స్ లో 48 స్పెర్మ్స్ ఉన్నాయి. వీటినన్నిటిని 2013లో పంపించింది.

ఈ అధ్యయనం లో ఉపయోగించిన ఫ్రీజ్-ఎండిన స్పెర్మ్‌ను ఆర్బిటాల్ అవుట్‌పోస్టులో 200 సంవత్సరాల వరకు నిల్వ చేయ వచ్చని బృందం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news