మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ కు మరో షాక్..!

-

మాజీ మంత్రి, వైసిపి నేత కాకాని గోవర్ధన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని వార్తలు వస్తున్నాయి. రుస్తుం వైన్స్ లో పేలుడు పదార్థాలు… గిరిజనులు నిలదీయడం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోనే ఆ గిరిజనులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు బెదిరించారని అభియోగాలు వస్తున్నాయి.

kakani-govardhan-reddy

మరోవైపు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో… విచారణకు హాజరుకావాలని నిన్న మరోసారి కాకాని గోవర్ధన్ కు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. కానీ విచారణకు మాత్రం కాకాని గోవర్ధన్ హాజరు కాలేదు. ఇవాళ కాకాని గోవర్ధన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరగనుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… రేపు రాత్రికి నెల్లూరు రాబోతున్నారట కాకాని గోవర్ధన్ రెడ్డి. గురువారం నుంచి అందుబాటులోకి వస్తానని కూడా తెలిపారట. అయినప్పటికీ ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news