టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకార్ కేంద్రానికి శంకుస్థాపన
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో టాటా ట్రస్ట్ సహకారంతో నిర్మించనున్న ‘ శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్’ (శ్రీకార్) కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టాటా చైర్మన్ రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. తితిదే కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా టాటా మాట్లాడుతూ.. శ్రీవారి చెంత 600 కోట్లతో 350 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ.. తిరుపతికి కేన్సర్ ఇన్ స్టిట్యూట్ రావడం శభపరిణామన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి మెడికల్ హబ్ గా మరనుందని, ట్రస్ట్ నిర్వాహణలో పారదర్శకత, నిబద్దతగల టాటా వారి ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మాణం జరగడం ఆనందంగా ఉందన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన అవసరమన్నారు.
మహిళలందరూ మందస్తుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని హితవు పలికారు. ఇప్పటికే తిరుపతో స్విమ్స్, రుయా, బర్డ్ లతో పాటు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటికి తోడు టాటా కేన్సర్ కేర్ ఆసుపత్రి ప్రజలకు త్వరలో అందుబాటులోకి వస్తోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపి భవిష్యత్ లో ఎలాంటి నీటి కొరత రాకుండా చూస్తామని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా రతన్ టాటాని ముఖ్యమంత్రి శ్రీవారి ఫొటోని బహుమతిగా ఇచ్చారు.