ఈ వస్తువులపై పెరగనున్న రేట్లు… కారణం ఇదే…!

-

ఇప్పుడు కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరిగేలా కనపడుతున్నాయి. దీనితో సామాన్యులకి ఝలక్ తగిలేలా కనపడుతోంది. మీరు కొత్తగా ఫ్యాన్, ఈసీ లాంటివి ఏమైనా కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. ఇక వివరాల లోకి వెళితే… ఇప్పుడు కాపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌ లో కేజీ కాపర్ ధర రూ.638 తాకింది. దీంతో మూలంగా పలు రకాల ప్రొడక్టుల ధరలు కూడా పైకి చేరనున్నాయి. దీనితో ఈ వస్తువు కొనాలంటే మరీ కష్టమైపోయేలా కనపడుతోంది.

ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాపర్‌పై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీని మూలంగా రేట్లు తగ్గుతాయి అని అంత అనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. కాపర్ ధరలు మరింత పెరిగాయి. మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. దీంతో పరిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతోంది. కాపర్ వినియోగం కూడా కూడా పెరిగింది.

ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను కాపర్ ద్వారా అంచనా వేయొచ్చు. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటే కాపర్ రేట్లు కూడా పడిపోతాయి. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడితే రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఏది ఏమైనా పలు వస్తువుల పై దీని ప్రభావం చూపుతోంది. వాటర మోటార్, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్, కూలర్, మిక్సర్ గ్రైండర్, ఏసీ వంటి పలు రకాల ప్రొడక్టుల ధరలు రానున్న రోజుల్లో మరెంత పెరగొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version