మాజీ ప్రియుడిని తలుచుకొని ఎమోషనల్ అవుతున్న రతిక..!

-

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తూ టాస్క్ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అనేంత కసిగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఐదు వారాల ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని బిగ్ బాస్ అలా ఆశపెట్టారో లేదో ఇలా కంటెస్టెంట్ లందరూ అలర్ట్ అయిపోయారు. ఈ క్రమంలోనే కొంతమంది మెప్పించగా మరి కొంతమంది ఓవరాక్షన్ చేశారు. ఇకపోతే ఎప్పుడూ అల్లరి పిల్లగా కనిపించే రతిక తన మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇక సెప్టెంబర్ 7 న ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. లేడీ గెటప్ లో బిగ్బాస్ తనను ఇంప్రెస్ చేసిన వారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే అవకాశం ఇస్తానని తెలిపాడు.

దీంతో అమర్దీప్ అదుర్స్ సినిమాలోని ఎన్టీఆర్ చారి పాత్రలో.. రతిక బ్రహ్మీ క్యారెక్టర్ లో ఇమిడిపోయారు.. ప్రిన్స్ లేడీ గెటప్ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ అలరించాడు. శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని.. తనలో ఉన్న ప్రస్టేషన్ తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకొని బిగ్ బాస్ ను చడామాడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు. ఇక మెలికలు తిరిగిన రతిక.. అటు గౌతమ్ ను శివాజీ బీపీ చెక్ చేయమని, రతికాను స్టేతస్కోప్ తో అందరి గుండె ఏం చెబుతుందో చెప్పాలని తెలిపాడు. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. భరించలేక ఆఖరికి బిగ్ బాస్ అతడిని కన్ఫేషన్ రూమ్ లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతని నోటికి తాళం పడేలా చేశాడు.

ఇక ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్ బాస్ రతికను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా అమాయకంగా ఉండాలి.. సంగీతంపై అవగాహన ఉండాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. ఎవరినైనా మిస్ అవుతున్నావా అని బిగ్ బాస్ అడగగా.. కన్నీళ్లు పెట్టుకుంది రతిక. ఈ టాపిక్ రాగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు బిగ్ బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో అని చూస్తున్నాను అంటూ చెప్పింది. ఇక తర్వాత ఆమెను సంతోష పెట్టడానికి బిగ్బాస్ నువ్వెన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఒక పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా వూచ్ అనే పాట ప్లే చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news