రేష‌న్ కార్డుకు కొత్త రూల్స్‌…!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. దీని వలన చాలా ప్రయోజనాలు వున్నాయి. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి సమయం లో దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత రేష‌న్ ని ఇచ్చింది. అయితే కొందరు రేష‌న్ కార్డుల‌కు అన‌ర్హులైనా ఉచిత రేష‌న్‌తో ల‌బ్ధి పొందార‌ని ప్ర‌భుత్వం కి తెలిసింది.

అందుకనే అన‌ర్హులైన వారు రేష‌న్ కార్డుల‌ను ప్రభుత్వం సరెండర్ చెయ్యాలని అంది. ఒక‌వేళ అన‌ర్హులైన కార్డుల య‌జ‌మానులు త‌మ రేష‌న్ కార్డుల‌ను స‌రెండ‌ర్ చేయ‌క‌పోతే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

ఇక మరి పూర్తి వివరాలను చూస్తే.. రూ.10 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మాత్ర‌మే దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాలుగా ప‌రిగ‌ణిస్తారు. అయితే వారికి మాత్ర‌మే రేష‌న్ కార్డులను ప్ర‌భుత్వం జారీ చేస్తుంది.

మరి ఇక ఎవరెవరు రేష‌న్ కార్డు స‌రెండ‌ర్ చేసేయాలి అన్నది చూస్తే.. 100 చ‌ద‌రపు మీట‌ర్ల కంటే ఎక్కువ నిడివి వున్నా ఇల్లు లేదా ఫ్లాట్‌, కారు లేదా ట్రాక్ట‌ర్‌, గ్రామం లో రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వార్షికాదాయం, న‌గ‌రాల్లో రూ.3 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే కార్డు ఇచ్చేయాలి. త‌హ‌సీల్దార్‌కు గానీ, డీఎస్‌వో ఆఫీసు లో కానీ రేష‌న్ కార్డు స‌రెండ‌ర్ చెయ్యాలి.

ఇక ఎల్లో రేషన్ కార్డుకి అయితే వార్షికాదాయం రూ.15 వేల వ‌ర‌కు గ‌ల కుటుంబాలు అర్హులు. కుటుంబంలో డాక్ట‌ర్‌, న్యాయ‌వాది, ఆర్కిటెక్‌, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ వుండకూడదు. ప్రొఫెష‌న‌ల్ టాక్స్/ సేల్స్ టాక్స్/ ఇన్‌కం టాక్స్ చెల్లింపుదారులు కుటుంబంలో వుండకూడదు. అలానే రెసిడెన్షియ‌ల్‌లో ఫోన్ ఫెసిలిటీ లేని కుటుంబాలు అర్హులు.

కారు వుండకూడదు. ఇంట్లో స‌భ్యులంద‌రికీ క‌లిపి రెండు హెక్టార్ల మెట్ట‌, హెక్టార్ మాగాణి, క‌రువు ప్రాంతాల్లో అర్ధ హెక్టార్ భూమి కూడా లేని వారు అయ్యి ఉండాలి. కాషాయ కార్డు కి అయితే టాక్సీ మిన‌హా కార్లు లేని కుటుంబాలు మాత్రమే అర్హులు. నాలుగు హెక్టార్ల కంటే త‌క్కువ భూమి ఉండాలి. రూ.15 వేల నుంచి రూ. ల‌క్ష లోపు వార్షిక ఆదాయం గ‌ల కుటుంబాలు దీనికి అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news