తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెల నుంచి రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులతో పాటుగా మరొక వస్తువును ఉచితంగా పొందనున్నారు. ఆ వస్తువును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదేంటో తెలుసా రేషన్ బ్యాగు. దీనిలో సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోలతో పాటు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను ఇందులో ముద్రిస్తారని సమాచారం అందుతోంది.

ఇదిలా ఉండగా…. తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి కొత్త రేషన్ కార్డులను అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో రేషన్ కార్డు పొందిన ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా ఇదివరకే రేషన్ కార్డు ఉన్నవారికి ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందించారు. వచ్చే నెలలో కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని అందించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి కూడా రేషన్ బియ్యాన్ని అందించనున్నారు.