కళ్లు చెదిరే ధరకు భవంతిని కొనుగోలు చేసిన భారత బిలియనీర్

-

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ భారతీయుల ముద్ర సుస్పష్టం. ఇండియన్ బిలియనీర్ రవి రుయా లండన్‌లో 145 మిలియన్ల అమెరికా డాలర్ల (113 మిలియన్ల బ్రిటన్ పౌండ్లు – భారత కరెన్సీలో దాని విలువ రూ.1200 కోట్లు) విలువ చేసే లండన్ మాన్షన్ సొంతం చేసుకున్నారు. రష్యా ప్రాపర్టీ డీలర్ ఆండ్రేయ్ గొంచారెంకో నుంచి రవి రుయా కొనుగోలు చేశారు.

గత కొన్నేళ్ల కాలంలో యూకే రాజధానిలో జరిగిన భారీ గృహ కొనుగోళ్లలో ఇదొకటిగా నిలిచింది. పెట్టుబడుల సంస్థ ఎస్సార్ గ్రూప్ కు రవి రుయా సహ యజమానిగా ఉన్నారు. తమ కుటుంబం తరఫున తాజా భవంతిని ఆయన కొన్నారు. ఈ భవనం పేరు హానోవర్ లాడ్జ్ మాన్షన్. లండన్ లోని ఖరీదైన ప్రాంతం రీజెంట్స్ పార్క్ ఏరియాలో ఉంది.

కాగా ఈ భవనానికి గతంలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ మద్దతుదారుడు రాజ్ కుమార్ బాగ్రి యజమానిగా ఉన్నారు. ఇది చేతులు మారుతూ చివరికి రవి రుయా చేతికి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version