దేశ భవిష్యత్ పై మోడీ విజన్ తో ఉన్నారు : బీజేపీ సీనియర్ నేత

-

హెచ్‌ఐసీసీలో జరిగిన రెండో రోజు సమావేశాల్లో మోడీ ప్రసంగంపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెవల్యూషన్ పై మోడీ మాట్లాడారన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందించాలని వివరించారని, నిరంకుశ, నియంత్రుత్వ పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి కలిగించిన వ్యక్తి సర్దార్ పటేల్ అని తెలిపారు. హైదరాబాద్ సర్దార్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్ అని, సర్దార్ పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశామన్నారు. మా ప్రభుత్వం ఇప్పటి వరకున్న ప్రధానుల గురించి ఒక మ్యూజియంను ఏర్పాటుచేశామన్నారు రవిశంకర్ ప్రసాద్. పార్టీలకతీతంగా ఈ పనులన్నీ చేశాం. ప్రజాస్వామ్య పాలనపై మాకున్న డెడికేషన వల్ల ఇది సాధ్యమని, దేశ భవిష్యత్ పై మోడీ విజన్ తో ఉన్నారని రవిశంకర్ ప్రసాద్.

కొవిడ్ సమయంలో దేశ ప్రజలంతా ఎన్నో చాలెంజ్ లు ఎదుర్కొన్నారు. ఆయన విజన్ తో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించారని, కరోనా కారణంగా ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోయిందన్న రవిశంకర్ ప్రసాద్ .. అయినా ఇతర దేశాలతో పోలిస్తే దేశం పరిస్థితి చాలా ఉన్నతస్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ దిగుమతులు కూడా అద్భుతంగా జరిగాయి. ఇవన్నీ మోడీ విజన్ వల్లే అని ఆయన కొనియాడారు. దేశంలోని ఇతర పార్టీల నేతలు తమను తాము రాజులుగా భావిస్తున్నారు.. అందుకే ఇన్నేండ్లు వెనుకబడిపోయిందని, కానీ మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version