క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగుళూరులోని ఎన్సిఏ అకాడమీలో రిహబిటేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ అనంతరం ఎన్సిఏ క్యాంపు లో కోలుకునే పనిలో ఉన్నాడు. కాగా, కుడి మోకాలికి బ్యాండేజీ తో ఉన్న జడేజా ఫిట్నెస్ రూమ్ లో మెల్లిగా అడుగులు వేస్తూ కనిపించాడు.
అయితే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకూడదు అన్న ఉద్దేశంతో అడుగులో అడుగులు వేస్తూ జాగ్రత్తగా నడిచాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో స్వయంగా షేర్ చేసిన రవీంద్ర జడేజా “పాపా-పగిలి” అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక మోకాలి గాయంతో రవీంద్ర జడేజా అక్టోబర్ లో జరగనున్న టి20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. ఇప్పటికే అసీస్, సౌత్ ఆఫ్రికాలతో టీ20 సిరీస్ లకు దూరమైన జడేజా కోలుకోవడానికి ఆరువారాల సమయం పట్టనుండడంతో ప్రపంచ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా తో జరగనున్న వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు.