RT 70 : రవితేజ ’70’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ.. గురించి స్పెషల్‌ గా చెప్పనక్కర్లేదు. క్రాక్‌ లాంటి భారీ హిట్‌ తర్వాత రవితేజ్‌ వరుసగా ప్రాజెక్ట్స్‌ ను లైన్‌ లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్‌ వర్మ దర్శకత్వం లో చేస్తున్న ఖిలాబీ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. ప్రస్తుతం షూటింగ్‌ దశ లో రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా సినిమాలున్నాయి. ఇక ఇటీవలే ధమాకా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు రవితేజ.

త్రినాథరావు నక్కిన దీనికి దర్శకత్వం వహిస్తుండగా… పెళ్లి సందD ఫేమ్‌ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రామారావు ఆన్‌ డ్యూటీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని సమచారం. శరత్‌ మండవ రూపొందిస్తున్న ఇందులో దివ్యాంశ కౌశిక్‌, రజిష విజయన్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు.

ఈ నేపథ్యం లోనే రవితేజ కెరీర్‌ లో 70 వ సినిమా కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. #RT70.. heros dont exist పేరుతో ఓ అప్డేట్‌ ఇచ్చారు రవితేజ. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మరియు టైటిల్‌ ను.. నవంబర్‌ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ను విదిలింది చిత్ర బృందం. ఇక అప్డేట్‌ తో రవితేజ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version