కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తే కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారు : రావుల శ్రీధర్ రెడ్డి

-

తప్పుడు కేసును కేటీఆర్ పై బనాయించారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తే కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారు అని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. చామల కిరణ్ రెడ్డి లాంటి బ్రోకర్లు కేటీఆర్ పై మాట్లాడే అర్హత లేదు. చామల కిరణ్ రెడ్డి పేమెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. చామల కిరణ్ రెడ్డి బ్రోకర్.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పని చేసి పదేళ్లు మంత్రి అయ్యారు. చామల కిరణ్ రెడ్డి రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు త్రాగి ఎంపీ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లక్షా 37 వేల కోట్లు అప్పుల్లో ఎవరి వాటా ఎంత. రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో చామల కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు. కేటీఆర్ పై మాట్లాడే స్థాయి చామల కిరణ్ రెడ్డిది కాదు. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. క్విడ్ ప్రోకో అంటే తెలియని వాళ్ళు చిల్లరమల్లరగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. కేటీఆర్ పై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ ను తిట్టి వార్తల్లో ఉండాలని అనుకుంటున్నారు అని రావుల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news