ఈరోజు ఉదయం నుండి ఏసీబీ చేస్తున్న కేటీఆర్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్‌ను విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించారు . ఇకసంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్ ను విచారించనున్నారు. అయితే విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్.. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను అని పేర్కొన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తామన్న వస్తానని చెప్పాను. కేసులో విషయమే లేదు . ప్రభుత్వ ఒత్తిళ్ళ మేరకే కేసు పెట్టారు అసంబద్ధమైన కేసు అని అన్నారు.
నేను ఈ విచారణకు పూర్తిగా సహకరించా. నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా. అయితే ఈరోజు విచారణలో రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే అటు ఇటు తిప్పితిప్పి అడిగారు. ఆ నాలుగు ప్రశ్నలను 40 సార్లు అడిగారు. కొత్తగా వాళ్లు అడిగిందేమీ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.