బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంకులు డిపాజిట్లను పెంచుకోవడం కోసం వడ్డీ రేట్లను పెంచచ్చని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. వడ్డీ రేట్లను మరింత పెంచొచ్చని… దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటోంది. 2022 మే నెల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే.
సో బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల ని పెంచాలని చూస్తోంది అని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ విషయాలని ఆర్బీఐ చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ బులెటిన్ ప్రకారం టర్మ్ డిపాజిట్లపై రాబడి మెరుగుపడింది. సేవింగ్స్ డిపాజిట్ రేట్లు కూడా పెరిగాయి. ఎక్కువగా బ్యాంక్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్ల రూపంలోనే వున్నాయి. వార్షికంగా అయితే టర్మ్ డిపాజిట్లు 13.2 శాతం పెరిగాయి.
కరెంట్ అండ్ సేవింగ్స్ డిపాజిట్లు 4.6 శాతం, 7.3 శాతం పెంచాయి. వరుసగా ఆరు సార్లు రెపో రేటు ని పెంచడం తో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలని అనుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ని ఇస్తున్నాయి.
అమెరికాలో బ్యాంకుల సంక్షోభం కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పరిమితంగానే వుంది. కానీ ఆర్‌బీఐ మాత్రం వచ్చే పాసలీ సమీక్షలో కూడా రెపో రేటు ని పెంచొచ్చనే తెలుస్తోంది. పావు శాతం మేర రెపో రేటు పెరిగే అవకాశం వుంది. ఏప్రిల్‌లో రెపో రేటు పావు శాతం పెరిగితే 6.75 శాతానికి వెళ్ళచ్చు.