స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్‌బీఐ భారీ షాక్‌!

-

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టేట్‌ బ్యాంక్‌కు భారీ షాకిచ్చింది. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో భారీగా జరిమానా విధించింది.ఆర్‌బీఐ ప్రతిపాదించిన నిబంధనలను దేశీయ అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో రూ.2 కోట్లు ఫైన్‌ విధించింది. ఈ మేరకు ఆర్‌బీఐ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.

ఉద్యోగుల వేతన విషయంలో నిబంధనలను అతిక్రమించిన దేశీయ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గట్టి ఝలక్‌ ఇచ్చింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా భారీ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు, కమీషన్‌ రూపంలో ఉద్యోగులకు వేతనం చెల్లించడంపై ఎస్‌బీఐకి, ఆర్‌బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను అతిక్రమించడం వల్ల భారీ జరిమానా పడింది. ఆర్‌బీఐ ఏకంగా రూ.2 కోట్ల జరిమానాను ఎస్‌బీఐపై విధించింది.

ఇకపోతే ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు తీపికబురు అందించింది. కారు కొనుగోలు చేసే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. అలాగే ఇటీవలె గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. అదే విధంగా కారు కొనే వారికి చౌక వడ్డీ ధరలకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం కానుంది. అలాగే కారు రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ కూడా చేసింది. అంతేకాకుండా యోనో ద్వారా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే సూత్రప్రాయ ఆమోదం పొందవచ్చు. ఇటీవలే మార్చి 8న జరిగిన మహిళా దినోత్సవం రోజు కూడా మహిళా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను అందించింది. కొన్ని క్యాష్‌బ్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అతిక్రమించిన విషయంలో స్టేట్‌ బ్యాంక్‌పై తదుపరి చర్యలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version