రేపో రేటు పై ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రేపో రేటు యథాతధమని కీలక ప్రకటన చేశారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదిక ఆయన ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ప్రకారం… భారతీయ రిజర్వ్ బ్యాంక్ వరుసగా 10వ సారి రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచిందన్న మాట.
అలాగే… రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచుతుందని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు విధానపరమైన మద్దతు కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు, రివర్స్ రెపో రేటు అది వాణిజ్య రుణదాతల నుండి రుణం తీసుకుంటుందని చెప్పారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. RBI మే 2020 నుండి కీలకమైన రెపో రేటును రికార్డు స్థాయిలో ఉంచిందని.. చెప్పారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.