ఆర్బీఐ : ఇక మీదట నిమిషాల్లోనే లోన్..!

-

కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పింది. కొత్త సర్వీసులు ని ఇప్పుడు ఆర్బీఐ అందుబాటు లోకి తీసుకు రానుంది. సో ఇక మీద కస్టమర్లకు నిమిషాల వ్యవధిలోనే లోన్ ని పొందవచ్చట. పూర్తి వివరాలు చూస్తే.. రుణ గ్రహీతలకు ఇక మీదట ఆర్బీఐ నిర్ణయం తో ప్రయోజనం కలుగుతందని చెప్పుకోవచ్చు.

త్వరలోనే దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనుంది. ఆర్‌బీఐ ఈ కొత్త పోర్టల్ ద్వారా బ్యాంకులు డిజిటల్ ఇన్‌ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు త్వరగా క్రెడిట్ లేదా లోన్స్ వస్తాయట. పబ్లిక్ టెక ప్లాట్‌ఫామ్ అందుబాటు లోకి వస్తే నిమిషాల లోనే లోన్స్ వస్తాయి.

ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇది అని చెప్పుకోవచ్చు. కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అలానే ఫిన్‌టెక్ సంస్థలు, స్టార్టప్స్ కూడా దీనిలో భాగం కానున్నాయి. మాములుగా లోన్ ని తీసుకోవాలంటే ఎక్కువ టైం పడుతోంది. అందుకే ఇప్పుడు ఈ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ దీన్ని తీసుకు వస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version