దేశ వ్యాప్తంగా డీమానిటైజేషన్ వల్ల కలిగిన ఇబ్బందులు మరువక ముందే ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దీ తర్వాత కొత్తగా వచ్చిన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేస్తున్నట్లు ఆర్‌బిఐ గురువారం ప్రకటించింది. అయితే ముద్రణ ఆగినప్పటకీ 2వేల నోట్లు చలామణిలో ఉంటాయని వెల్లడించింది. మనీలాండరింగ్ తగ్గించేందుకు ముద్రణ నిలిపివేసినట్లు పేర్కొంది. నల్లధనం వెలికితీత, అవినీతిని అరికట్టేందుకు మాత్రమే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.