చీకటి గదిలో చితక్కొట్టారు.. టీజర్

-

బూతు.. బూతు.. బూతు.. అని అనకండి. బూతు వీడియోలు కావాలంటే ఇంటర్నెట్‌లో కరువా? కాదు కదా. అయినప్పటికీ అడల్డ్ కంటెంట్ సినిమాలకు ఆదరణ రోజరోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఆ ఆదరణను క్యాచ్ చేసుకోవడానికి రొమాంటిక్ సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో రావడం మొదలు పెట్టారు. ఒక ఆర్‌ఎక్స్ 100, 24 కిస్సెస్ లాంటి వన్నీ రొమాంటిక్ సినిమాలో. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా టీజర్ ఇవాళ రిలీజయింది. ఇదివరకు రిలీజయిన సినిమా ఫస్ట్ లుక్ సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీజర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. సినిమాలోని నటులు ఏమాత్రం తగ్గలేదు.

సినిమా టీజర్ చూస్తే.. కొంచెం రొమాన్స్.. కొంచెం భయాన్ని కలగలిపి ఉన్నట్టుగా ఉంది. దెయ్యం కాన్సెప్ట్‌ను కూడా ఇందులో మిక్స్ చేసినట్టున్నారు. సినిమా క్రిటిక్ కత్తి మహేశ్.. సినిమా కథను చెబుతుంటాడు. అదిత్, సిక్కి తంబోలి, పోసాని మరళి కృష్ణ, రఘుబాబు, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్, మిర్చి హేమంత్, భాగ్యశ్రీ మోతె, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోశ్ పీ జయకుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు కానీ.. ప్రస్తుతానికి ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version