దేశంలో నిషేధానికి గురైన రూ.2 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. దేశంలో చెలామణిలో ఉండే రూ.2 వేల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చాయని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. కేవలం రూ.6,970 కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఇదిలాఉండగా, దేశంలో పెద్ద నోట్ల రద్దు రెండు మార్లు కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోనే జరిగిన విషయం తెలిసిందే. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయ్యాక పెద్దనోట్లు రూ.1000, రూ.500లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్లను తీసుకొచ్చారు. ఇటీవల మరోసారి రూ.2వేల నోటును బ్యాన్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. అవినీతి పెరుగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రవర్గాలు వెల్లడించాయి.