ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ కేదార్ జాదవ్‌కు అవకాశం ఇచ్చింది, ఈ సీజన్‌లో పెళుసుగా కనిపించిన వారి మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి తీరని ఎత్తుగడ. మిచెల్ మార్ష్ డీసీ ప్లేయింగ్ ఎలెవన్ కి తిరిగి వచ్చాడు, అయితే అన్రిచ్ నార్ట్జే వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు.
ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో 174 పరుగుల స్కోరు చేసిన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ని 151 పరుగులకే కట్టడి చేసింది. మనీశ్ పాండే 50 పరుగులతో రాణించినా ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోయాడు. త మ్యాచ్‌లో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్‌సీబీ కూడా 127 పరుగుల టార్గెట్‌ని కాపాడుకుంటూ లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తు చేసింది… రెండు లో స్కోరింగ్ మ్యాచుల తర్వాత ఈ రెండు జట్లు తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు ఆశిస్తున్నారు అభిమానులు.