చాలామంది రెగ్యులర్ గా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతూ ఉంటారు ప్రతిరోజు మీరు కూడా ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్ ద్వారా ఈజీగా ఆ సమస్య నుండి బయట పడొచ్చు. ఆవిరి పడితే మూసుకుపోయిన నాసిక రంద్రాలను శుభ్రం చేసేందుకు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచేందుకు అవుతుంది కాబట్టి ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడే వాళ్ళు సమస్య కలిగినప్పుడల్లా ఆవిరి పడుతూ ఉండండి.
వేడి నీటితో మీరు పెప్పెర్మెంట్ జండుబాంని వేసి ఆవిరి పడితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు యూకలిప్టస్ ఆయిల్ వాసనని పీల్చడం వలన ముక్కులో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. వేడి నీటిలో కలిపి మీరు ఈ ఆయిల్ ని పీల్చోలేకపోతే కేవలం ఈ ఆయిల్ స్మెల్ చూసిన కూడా ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయి. రెండు టీ స్పూన్ల ఉప్పుని గోరువెచ్చని నీటిలో వేయండి ఆ తర్వాత రెండు చుక్కలని ముక్కు రంధ్రాల్లో వేయండి ఇలా చేయడం వలన కూడా ఈ సమస్య తొలగిపోతుంది. శ్వాస మార్గంలో అడ్డంకులు కూడా ఉండవు.
వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నా కూడా ఈ సమస్య పోతుంది వెల్లుల్లి సూప్ తాగినా కూడా ముక్కు దిబ్బడ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది ఇన్ఫెక్షన్స్ వంటివి ఉండవు. ఉల్లిపాయల ఘాటు వాసనకి కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. ఐదు నిమిషాల పాటు మీరు ఉల్లిపాయ వాసనని చూస్తే ముక్కు క్లియర్ అవుతుంది ఊపిరి బాగా అందుతుంది. రెండు టీ స్పూన్ల నిమ్మరసానికి నల్ల మిరియాలు ఉప్పు వేసి ముక్కు పై అప్లై చేస్తే ముక్కుదిబ్బడ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.
టమాటా సూప్ ని తీసుకున్నా కూడా రిలీఫ్ గా ఉంటుంది. తులసి ఆకుల్ని తీసుకుని ఉదయాన్నే అల్పాహారం తీసుకునే ముందు వాటిని నమిలితే కూడా ఈ సమస్య నుండి బయటపడొచ్చు. ముక్కుదిబ్బడ నుండి బయటపడడానికి అవుతుంది. అల్లం కూడా బాగా పనిచేస్తుంది జలుబు త్వరగా తగ్గుతుంది. నాసిక మార్గంలో అడ్డంకులని తొలగించడానికి కూడా అల్లం బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అల్లం టీ ని కూడా తీసుకోవచ్చు ఇలా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.