మీరు పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి స్కీమ్ అందుబాటులో వుంది. దాని వలన మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఆ స్కీమ్ ఏ రికరింగ్ డిపాజిట్ పథకం. అయితే దీనిలో మీరు ప్రతి నెలా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అయితే మెచ్యూరిటీ సమయం లో ఒకేసారి డబ్బులు వస్తాయి.
ఇందులో డబ్బులు పెడితే ఆకర్షణీయ రాబడి మీకు వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ లో ప్రతి నెలా కొంత డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉండడం ముఖ్యం. దీని వలన ఏ రిస్క్ కూడా ఉండదు. ఈ ఆర్‌డీ అకౌంట్‌ను మీరు రూ.100తో స్టార్ట్ చెయ్యచ్చు.
దీనిలో మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళితే….. కొంత కాలం తర్వాత పెట్టిన డబ్బు తో పాటు వడ్డీ కూడా మీకు వస్తుంది. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీరు అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు కూడా. నెలకు రూ.10 వేలు పోస్టాఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ పదేళ్లు డిపాజిట్ చేసారంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రూ.12 లక్షలు అవుతాయి.
ఇప్పుడు మీకు మెచ్యూరిటీ కాలంలో రూ.16.28 లక్షలు వస్తాయి. ఇక్కడ వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. మీరు ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు ఆర్‌డీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాగా మూడు నెలలకు ఒకసారి మారుతూ రావొచ్చు.