సచివాలయంలో ఎమ్మెల్యే మెఘారెడ్డికి చేదు అనుభవం..!

-

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సెక్రటేరియట్ ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. ఆరో అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలోనే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే ఫ్లోర్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ పోలీసులు ఎమ్మెల్యే మెఘారెడ్డిని అడ్డుకున్నారు. సీఎస్ వస్తున్నారు. పక్కన ఉండాలంటూ నిలబెట్టారు.

దీంతో తాను ఎమ్మెల్యేనని చెప్పినా ఆయన మాటను వినిపించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే మెఘారెడ్డి, సీఎస్ వస్తే.. ఫ్లోర్ లో ఎవ్వరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇలాంటి ఘటనలు సచివాలయంలో నిత్యం చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. కనీసం ఎవ్వరూ ఎంపీ ఎవ్వరూ ఎమ్మెల్యేనో ఎస్పీ ఎఫ్ సిబ్బంది గుర్తు పట్టడం లేదనే ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news