ఎప్పుడూ డ్యూటీ చేయని ఆర్డీవోలు నిన్న చేశారు : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్

-

వరంగల్ బీఆర్ఎస్ సభ విజయవంతం అయ్యిందని గులాబీ శ్రేణులు చెబుతుండగా.. అసలు జనాలే రాలేదని.. అదంతా మార్ఫింగ్ వీడియోలు అని.. సభ సక్సెస్ కాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రసంగం మీద మంత్రులు పొంగులేటి, సీతక్క నిన్న రాత్రి తీవ్రంగా మండిపడ్డారు.

ఇదిలాఉండగా, వరంగల్‌లోని ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ కోసం వెళ్తున్న బీఆర్ఎస్ వాహనాలు, బస్సులను ఆర్డీవోలు కావాలనే అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టీవోలు బీఆర్‌ఎస్ సభను అడ్డుకున్నారు. ఎన్నడూ డ్యూటీకి వెళ్లని ఆర్టీవోలు నిన్న రోడ్ల మీద చెక్‌పోస్టులు పెట్టి విధులు నిర్వహించారు.వరంగల్ బీఆర్‌ఎస్ సభను ఆటంకపరిచారు’ అని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news